కారు- బైక్‌ ఢీ

ABN , First Publish Date - 2020-10-27T05:30:00+05:30 IST

జాతీయ రహదారిపై పురుషోత్తపట్నం వద్ద కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

కారు- బైక్‌ ఢీ

ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు
ఎటపాక, అక్టోబరు27 : జాతీయ రహదారిపై పురుషోత్తపట్నం వద్ద కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ చినబాబు తెలిపిన వివరాల ప్రకారం... గుండాల గ్రామానికి చెందిన మాచిన శ్రీనివాసరావు (46)తో పాటు అదే గ్రామానికి చెందిన రమణయ్య, మనోజు  ద్విచక్ర వాహనంపై భద్రాచలం వెళుతున్నారు.  ఛత్తీష్‌గఢ్‌కు చెందిన కారు భద్రాచలం నుంచి నెల్లిపాక వైపు వస్తోంది. పురుషోత్తపట్నం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది.  దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు  రహదారి పక్కకు ఎగిరిపడ్డారు. శ్రీనివాసరావు తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-27T05:30:00+05:30 IST