పెద్దాపురం ఏడీబీ రోడ్డులో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-13T05:48:11+05:30 IST

పెద్దాపురం-రాజమహేంద్రవరం రోడ్డులోని వాలుతిమ్మాపురం జంక్షన్‌లో శనివారం సాయంత్రం టాటా మేజిక్‌ వాహనం లారీని ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పెద్దాపురం ఏడీబీ రోడ్డులో రోడ్డు ప్రమాదం
ఘటనా స్థలంలో క్షతగాత్రులు

ఐదుగురికి తీవ్రగాయాలు

పెద్దాపురం, డిసెంబరు 12: పెద్దాపురం-రాజమహేంద్రవరం రోడ్డులోని వాలుతిమ్మాపురం జంక్షన్‌లో శనివారం సాయంత్రం టాటా మేజిక్‌ వాహనం లారీని ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న టాటా మ్యాజిక్‌  బైక్‌ను తప్పించబోయి లారీని లారీ ఢీకొంది.  దీంతో మ్యాజిక్‌లో ఉన్న రాజమహేంద్రవరానికి చెందిన పన్నీటి లక్ష్మి(64), పాలెపు బుజ్జిబాబు(54), గాజులాపల్లి నాగలక్ష్మి(55), పన్నీటి కమలమ్మ(65), గోకవరానికి చెందిన కసిరెడ్డి కృష్ణార్జున(51)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ బాలాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

 

Updated Date - 2020-12-13T05:48:11+05:30 IST