-
-
Home » Andhra Pradesh » East Godavari » accident in Singapore
-
సింగంపల్లిలో తాటాకిల్లు దగ్ధం
ABN , First Publish Date - 2020-03-23T09:01:41+05:30 IST
మండలం లోని సింగంపల్లిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో పాలేటి ఎర్రబ్బులకు చెందిన తాటాకిల్లు కాలి

రంగంపేట, మా ర్చి 22: మండలం లోని సింగంపల్లిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో పాలేటి ఎర్రబ్బులకు చెందిన తాటాకిల్లు కాలి పోయింది. పక్కనే ఉ న్న పశువులకు మేత వేయడానికి వెళ్లగా అ తడి భార్య పక్కింటికి వెళ్లింది. ఆ సమయంలో షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు లేచాయి. అనపర్తి అగ్ని మాపక కేంద్రం సిబ్బంది మంటలను అదుపుజేశారు. బీరువాలో ఉంచిన రూ. లక్ష, మూడు కాసుల బంగారు ఆభరణాలు కాలిపోయాయి. గేదెను అమ్మగా వచ్చిన సొమ్ము, డ్వాక్రా గ్రూపులో వచ్చిన రుణం బీరువాలో ఉంచారు. దుస్తులు పూర్తిగా బూడిద య్యా యి. ఈ విషయాన్ని తహశీల్దార్‌కు తెలియజేసినట్టు వీఆర్‌ఏ పి.నాని తెలిపారు.