జేసీ-3గా కీర్తి బాధ్యతల స్వీకారం

ABN , First Publish Date - 2020-05-17T09:27:03+05:30 IST

జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ)-3గా చేకూరి కీర్తి శనివారం బాధ్యతలు స్వీకరించారు.

జేసీ-3గా కీర్తి బాధ్యతల స్వీకారం

కాకినాడ, మే 16 (ఆంధ్రజ్యోతి): జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ)-3గా చేకూరి కీర్తి శనివారం బాధ్యతలు స్వీకరించారు.  కలెక్టరేట్‌లో ఆమెకు  ఒక చాంబర్‌ కేటాయించారు. గ్రామ/వార్డు సచివాలయాల అభివృద్ధిని ఆమె పర్యవేక్షిస్తారు. అలాగే ఇప్పటి వరకు జేసీ-1, జేసీ-2 చూస్తున్న వాటిలో కొన్నిటిని అప్పగించారు. వలంటీర్లు, పంచాయతీరాజ్‌, వైద్య, ఆరోగ్యం, విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్య, మునిసిపాలిటీలు,   గృహ నిర్మాణం, మీ-సేవ, రియల్‌టైం గవర్నెన్స్‌, ఐటీ, ఎనర్జీ, ఇరిగేషన్‌ మినహా అన్ని ఇంజనీరింగ్‌ శాఖలను కీర్తి చూస్తారు. 

Updated Date - 2020-05-17T09:27:03+05:30 IST