కార్టూన్‌ పోటీలకు విశేష స్పందన

ABN , First Publish Date - 2020-06-04T10:55:48+05:30 IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి ఆన్‌లైన్‌ చిత్రలేఖనం, కార్టూన్‌ పోటీలకు విశేష ..

కార్టూన్‌ పోటీలకు విశేష స్పందన

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), జూన్‌ 3:ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి ఆన్‌లైన్‌ చిత్రలేఖనం, కార్టూన్‌ పోటీలకు విశేష స్పందన లభించింది. జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్షా, గ్రీన్‌ ఇండియా ఫౌండేషన్‌, వీబీవీఆర్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా 238 మంది పాల్గొన్నారు.  విజేతలను జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం బుధవారం ప్రకటించారు. సమగ్రశిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ బి.విజయభాస్కర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు.  రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, గ్రీన్‌ ఇండియా ఫౌండేషన్‌ ప్రతినిధి కేవీకే మహేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T10:55:48+05:30 IST