పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-11-25T06:28:44+05:30 IST

మండలంలోని లొల్ల గ్రామానికి చెందిన దాడి రాంబాబు (35) అనారోగ్య కారణాలతో పాటు అప్పుల బాధలు తాళలేక మంగళవారం మధ్యాహ్నం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

ఆత్రేయపురం, నవంబరు 24: మండలంలోని లొల్ల గ్రామానికి చెందిన దాడి రాంబాబు (35) అనారోగ్య కారణాలతో పాటు అప్పుల బాధలు తాళలేక మంగళవారం మధ్యాహ్నం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య పుష్పావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ నిర్వహించారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. 


Read more