యువకుడికి యావజ్జీవ శిక్ష

ABN , First Publish Date - 2020-11-21T06:28:55+05:30 IST

అత్యచార ఘటనలో ఒక యువకుడికి కోర్టు యావజ్జీవ జైలు శిక్ష, రూ.15వేలు జరిమానా విధించినట్టు ఎస్‌ఐ జి.సురేంద్ర తెలిపారు.

యువకుడికి యావజ్జీవ శిక్ష

పి.గన్నవరం, నవంబరు 20: అత్యచార ఘటనలో ఒక యువకుడికి  కోర్టు యావజ్జీవ జైలు శిక్ష, రూ.15వేలు జరిమానా విధించినట్టు ఎస్‌ఐ జి.సురేంద్ర తెలిపారు.  గంటిపెదపూడికి చెందిన నూకపెయ్యి సురేష్‌ అదే గ్రామానికి చెందిన 17ఏళ్ల బాలికను ప్రేమించి మోసం చేశాడు. అతడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె 2016 జూన్‌4న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్‌ఐ పి.వీరబాబు కేసు నమోదు చేయగా డీఎస్పీ ఎల్‌.అంకయ్య ఽకేసు దర్యాప్తు చేశారు. కాకినాడ ఫోక్సో కోర్టులో పీపీ ఎండీ అక్బర్‌అజామ్‌ వాదనలు వినిపించారు. న్యాయమూర్తి సి.సత్యవాణి సురేష్‌కు యావజ్జీవ శిక్ష, రూ.15వేలు జరిమానా విధించారని ఎస్‌ఐ తెలిపారు.Read more