వ్యక్తి అదృశ్యంపై కేసు

ABN , First Publish Date - 2020-12-01T07:00:29+05:30 IST

వ్యక్తి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు

కొత్తపేట, నవంబరు 30: వ్యక్తి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమారుడు బొక్కా రాజేష్‌ ఈనెల23న తాపీమేస్త్రి బొక్కా కృష్ణతో కలిసి కొత్తపేట మండలం వాడపాలెం పనికి వెళ్లాడని, పని మధ్యలో బయటకు వెళ్లి మళ్లీ రాలేదని అంబాజీపేట మండలం పశుమెల్లకు చెందిన  సత్యనారాయణ ఫిర్యాదు చేశాడు. మతిస్థిమితం లేకపోవడంతో అప్పుడప్పుడు బయటకు వెళ్లి  పది రోజుల్లో తిరిగి ఇంటికి వచ్చేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఎస్‌ఐ కె.రమేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-01T07:00:29+05:30 IST