యాసిడ్‌ తాగిన వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-11-27T07:00:23+05:30 IST

ఒక వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

యాసిడ్‌ తాగిన వ్యక్తి మృతి

పి.గన్నవరం, నవంబరు 26: ఒక వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కె.ఏనుగుపల్లికి చెందిన శేరు నరసింహమూర్తి(60) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.  మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు మందలించారు. మనస్థాపం చెందిన అతడు ఈనెల25న బాత్‌రూమ్స్‌ శుభ్రం చేసే యాసిడ్‌ తాగాడు. కుటుంబసభ్యులు అతడిని పి.గన్నవరం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అమలాపురం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం అతడు మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more