-
-
Home » Andhra Pradesh » East Godavari » a lady voulanry sucide
-
మహిళా వలంటీర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-06T06:47:38+05:30 IST
కడుపునొప్పి తట్టుకోలేక ఒక మహిళా వలంటీర్ ఆత్మహత్య చేసుకుంది.

కొత్తపేట, డిసెంబరు 5: కడుపునొప్పి తట్టుకోలేక ఒక మహిళా వలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. వానపల్లి జాషువానగర్‌కు చెందిన కొల్లి రాముడు కుమార్తె నాగలక్ష్మిని ఆరేళ్ల క్రితం రామారావుపేటకు చెందిన ఉందుర్తి శ్రీనుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు. శనివారం తన కుమార్తె నాగలక్ష్మి కడుపునొప్పి తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తండ్రి రాముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.