మెరుగైన చేతిరాతతో ఉజ్వల భవిష్యత్‌

ABN , First Publish Date - 2020-10-07T10:05:29+05:30 IST

మెరుగైన చేతి రాతతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని నగరపాలకసంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు...

మెరుగైన చేతిరాతతో ఉజ్వల భవిష్యత్‌

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 6: మెరుగైన చేతి రాతతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని నగరపాలకసంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో 9,10 తరగతుల విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్‌ చేతిరాత శిక్షణా తరగతులకు సంబంధించిన పుస్తకాలను అందజేసి క్లాస్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ విద్యార్థులు చేతిరాతను మెరుగుపరుచుకోవడం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వం, విశ్వాసం పెంపోందించుకోవచ్చన్నారు. పశుసంవర్ధకశాఖ రిటైర్డ్‌ డీడీ డాక్టర్‌ రామకోటేశ్వరరావు తన తల్లి అన్నపూర్ణమ్మ పేరిట ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణకు చేతిరాత పుస్తకాలను అందించారు. బుధవారం నుంచి ఈ శిక్షణా తరగతులు కంటిపూడి రామారావు స్కూల్‌లో ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సల్‌ హేండ్‌రైటింగ్‌ అకాడ మీ డైరెక్టర్‌ ఎస్‌రాజేష్‌ ఖన్నా పాల్గొన్నారు.


మేధస్సు పెంచేందుకు ప్రాధాన్యం

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ స్కూల్స్‌లో విద్యా ర్థుల మేధస్సును పెంచే కృత్యాలకు ప్రాధాన్యమివ్వాలని కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సూచించారు. మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో నాగరాజా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మోటూరి మంగారాణి రచించిన కొత్త సిలబస్సు పాఠ్యపుస్తకాలను కమిషనర్‌కు చూ పించారు. ఆమెను కమిషనర్‌ అభినందించి తగు సూచనలు చేశారు. అనంతరం ఆమె అడిషనల్‌ కమిషనర్‌ ఎన్‌వివి సత్యనారాయణను కలిశారు.

Read more