-
-
Home » Andhra Pradesh » East Godavari » 9lakshs sevalu in district
-
సచివాలయాల ద్వారా తొమ్మిది లక్షల సేవలు
ABN , First Publish Date - 2020-11-21T06:18:28+05:30 IST
సచివాలయ వ్యవస్థ ప్రారం భం నుంచి ఇప్పటివరకు జిల్లాలో తొమ్మిది లక్షల సేవ లను సచివాలయాల ద్వారా ప్రజలకు అందించామని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు.

రాజోలు, నవంబరు 20: సచివాలయ వ్యవస్థ ప్రారం భం నుంచి ఇప్పటివరకు జిల్లాలో తొమ్మిది లక్షల సేవ లను సచివాలయాల ద్వారా ప్రజలకు అందించామని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ భవన నిర్మా ణాల పురోగతిలో అన్ని నియోజకవర్గాల కంటే రాజోలు నియోజకవర్గం బాగా వెనుకబడి ఉందని, పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం రాజోలు మండల ప్రజాపరిషత్ కార్యా లయంలో రాజోలు నియోజకవర్గస్థాయి అధికారులతో నిర్వహించిన అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. భవన నిర్మాణాలను త్వరి తగతిన పూర్తిచేయాలని అధికారులను, ఎగ్జిక్యూటివ్ ఏజె న్సీలను ఆయన ఆదేశించారు. ప్రతి రెండువేల కుటుం బాలకు ఒక వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామ న్నారు. భవన నిర్మాణాల విషయంలో స్థలాల సమస్యలు ఉంటే సబ్‌కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం రాజోలు నియోజకవర్గంలోని సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు మండలాల్లో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య కేందాల్రు, అంగన్‌వాడీ భవన నిర్మాణాల ప్రగ తిపై ఆయన సమీక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ పెదపాటి అమ్మాజీ, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసా దరావు, అమలా పురం సబ్‌కలెక్టర్ హిమాన్షుకౌశిక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈటీ గాయత్రీదేవి, పంచాయ తీరాజ్ ఎస్‌ఈ ఎం.నాగరాజు, ప్రత్యేకాధికారి ఏవీఎస్.రాజన్, డివిజనల్ అభివృద్ధి అధికారి వి.శాంతా మణి, ఆయా మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఇంజనీరింగ్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.