కరోనా బారిన 801 మంది

ABN , First Publish Date - 2020-10-07T07:51:16+05:30 IST

కరోనా వైరస్‌ కొత్తగా 801 మందికి సోకింది...

కరోనా బారిన 801 మంది

కాకినాడ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ కొత్తగా 801 మందికి సోకింది. ఇందులో ట్రూనాట్‌ ద్వారా 247, రాపిడ్‌ కిట్‌ల ద్వారా 554 మందికి వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో పాజిటివ్‌ కేసులు జిల్లావ్యాప్తంగా 1,02,439కి చేరాయి. తాజాగా కొవిడ్‌తో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య మొత్తం 548కు చేరాయి. వైరస్‌ నుంచి బయటపడి కోలుకున్నవారు 92,871 మందికాగా యాక్టివ్‌ కేసులు 9,020 ఉన్నాయి. 

Read more