30 ఏళ్ల తరువాత..కోరుకొండపై స్వామివారి కల్యాణం

ABN , First Publish Date - 2020-02-08T08:01:23+05:30 IST

చారిత్రాత్మక కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి శాంతికల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా

30 ఏళ్ల తరువాత..కోరుకొండపై స్వామివారి కల్యాణం

కోరుకొండ, ఫిబ్రవరి 7: చారిత్రాత్మక కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి శాంతికల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. 30 సంవత్సరాల క్రితం స్వామి వారికి కొండపైన ఇరగవరపు జగన్నాథాచార్యులు కల్యాణోత్సవం నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు చేపట్టారు. సాధారణంగా స్వామివారి కల్యాణం కొండ దిగువున మండపంలో జరుగుతుంటుంది. కొండపైన కల్యాణం నిర్వహించడం భారం అన్న ఉద్దేశంతో 30 ఏళ్లుగా ఆపివేశారు. అయితే కొండపైన స్వామివారికి కల్యాణం తిరిగి పునరుద్ధరించాలని అధ్యాపకస్వామి ఇరగవరపు కృష్ణమాచార్యులు 10సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. ఈ సంవత్సరం ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజా, అన్నవరం దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి సహకారంతో 3దశాబ్దాల తరువాత నరసింహస్వామికి కొండపైన కల్యాణం జరిగింది. కృష్ణమాచార్యుల దంపతులతో వైఖానస ఆగమ బ్రహ్మ సంతో్‌షకుమార్‌ ఆచార్యులు కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వాడపల్లి నాగుఆచార్యులు, పెదపాటి గిరిధరాచార్యులు, పెద్దింటి చంటిబాబు ఆచార్యులు, రఘురామ్‌ ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-08T08:01:23+05:30 IST