3 నుంచి రేషన్‌ పంపిణీకి సన్నాహాలు

ABN , First Publish Date - 2020-09-01T08:19:04+05:30 IST

రాష్ట్ర పౌరసరపరాల శాఖ కమిషనర్‌ జారీ చేసిన సూచనల ప్రకారం సెప్టెంబరు నెలకు సంబంఽధించి 11వ విడత నిత్యావసర సరుకుల పంపిణీకి జిల్లాలో అధికారులు సన్నాహాలు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న

3 నుంచి రేషన్‌ పంపిణీకి సన్నాహాలు

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ),

ఆగస్టు 31: రాష్ట్ర పౌరసరపరాల శాఖ కమిషనర్‌ జారీ చేసిన సూచనల ప్రకారం సెప్టెంబరు నెలకు సంబంఽధించి 11వ విడత నిత్యావసర సరుకుల పంపిణీకి జిల్లాలో అధికారులు సన్నాహాలు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న పాత, కొత్తగా పంపిణీ చేసిన రైస్‌ కార్డులకు సరుకులు అందజేయనున్నారు. తెలుపు కార్డులో ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, అంత్యోదయ అన్న యోజన ఒక్కోకార్డుకు 35 కిలోలు, అన్నపూర్ణ ఒక్కోకార్డుకు 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేయనున్నారు.


బీపీఎల్‌ ఒక్కో కార్డుకు ఉచితంగా కిలో కందిపప్పు, కిలో గోధుమ పిండి రూ.16.50కి, కిలో సాల్ట్‌ రూ.12కి పంపిణీ చేయనున్నారు. అంత్యోదయ అన్నయోజన కార్డుకు కిలో పంచదార రూ.13.50కి, అన్నపూర్ణ, తెలుపు కార్డులకు అరకిలో రూ.17కి పంపిణీ చేయనున్నారు. బీపీఎల్‌ ఒక్కో కార్డుకు బియ్యానికి బదులుగా 3కిలోల రాగులుగాని, 2 కిలోల జొన్నలుగాని ఉచితంగా అందజేయనున్నారు.

Updated Date - 2020-09-01T08:19:04+05:30 IST