పేకాడుతున్న 14 మంది అరెస్టు

ABN , First Publish Date - 2020-10-03T07:28:15+05:30 IST

గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్న 14 మందిని కాకినాడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.71,390

పేకాడుతున్న 14 మంది అరెస్టు

రూ.71,390 నగదు స్వాధీనం

నిందితులు అధికార పార్టీ ముఖ్య నాయకుల అనుచరులు

అసలు వ్యక్తులను తప్పించే ప్రయత్నం

పోలీసుల అదుపులో నిర్వాహకుడు


కాకినాడ క్రైం, అక్టోబరు 2: గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్న 14 మందిని కాకినాడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.71,390 నగదు స్వాధీనం చేసుకు న్నారు. టూటౌన్‌ సీఐ పీ ఈశ్వరుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక రిలయన్స్‌ మార్ట్‌ సమీపంలోని ఓ లాడ్జిలో పేకాట జరుగుతోందన్న పక్కా సమాచారంతో సీఐ బృందం ఆ లాడ్జిపై దాడి చేసింది.


ఈ దాడిలో పేకాడుతున్న 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే పేకాడు తున్నవారు వైసీపీకి చెందిన ముఖ్య నాయకుడి అనుచరులని, వారిని తప్పించేందుకు పోలీసు లపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు విశ్వసనీయ సమా చారం. కాగా పేకాట నిర్వాహకుడిగా చెబుతున్న అనిల్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-10-03T07:28:15+05:30 IST