అంబులెన్స్‌లు పెంచారు!

ABN , First Publish Date - 2020-07-05T10:46:19+05:30 IST

జిల్లాలో పెరుగుతోన్న కొవిడ్‌ కేసుల నేపథ్యంలో పాజి టివ్‌ సోకిన వారిని తరలించడానికి అదనంగా అంబు లెన్స్‌ను కేటాయించాలని కలెక్టర్‌

అంబులెన్స్‌లు పెంచారు!

జిల్లాలో కొవిడ్‌ బాధితుల తరలింపునకు అదనంగా 14 అంబులెన్స్‌లు

ఆంధ్రజ్యోతిలో ‘పక్కింటికీ పాజిటివ్‌’ కథనానికి స్పందించిన కలెక్టర్‌ 

కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్‌లకు కేటాయింపు

బొమ్మూరు వద్ద మూడు, విశాఖను రోగులను తరలించడానికి రెండు ఏర్పాటు

ప్రస్తుతం అంబులెన్స్‌లు చాలక పాజిటివ్‌ సోకిన వారి తరలింపులో జాప్యం

ఇకపై కొత్త శాంపిళ్ల సేకరణ తగ్గింపు..  పేరుకుపోయిన రిపోర్టులకు మోక్షం

కలెక్టరేట్‌లో వైద్యఆరోగ్యశాఖ సమీక్షలో కలెక్టర్‌ ఆదేశాలు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెరుగుతోన్న కొవిడ్‌ కేసుల నేపథ్యంలో పాజి టివ్‌ సోకిన వారిని తరలించడానికి అదనంగా అంబు లెన్స్‌ను కేటాయించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ రోగులను తరలించ డానికి కేవలం ఆరు అంబులెన్స్‌లు మాత్రమే తిరుగుతు న్నాయి. ఇవెక్కడా చాలడం లేదు. వందల్లో వస్తోన్న పాజిటివ్‌ కేసులకు సంబంధించి వైరస్‌ సోకిన వారిని ఆస్పత్రికి తరలించడానికి వీటి కోసం అధికారులు ఫోన్‌ లు చేస్తే రావడం లేదు. దీనివల్ల పాజిటివ్‌ నిర్ధారణ అయిన తర్వాత కూడా బాధితుడు రెండు లేదా మూడు రోజులు ఇంటిలోనే ఉండాల్సి వస్తోంది.


వాస్తవానికి ఏదైనా మండలంలో ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఇంటి నుంచి తరలించడానికి అంబులెన్స్‌ కోసం రెవెన్యూ శాఖ, స్థానిక ఆరోగ్య సిబ్బంది ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌లు ఖాళీ లేక రెండ్రోజుల తర్వాత వస్తు న్నాయి. దీంతో ఈలోపు కొవిడ్‌ సోకిన వ్యక్తి నుంచి వైరస్‌ మరింత ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని విశ్లేషిస్తూ శనివారం ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా సంచికలో ’పక్కింటికి పాజిటివ్‌’ అంటూ కథనం వచ్చింది. దీనిపై కలెక్టర్‌ స్పందించారు. కలెక్టరేట్‌లో కొవిడ్‌ జిల్లా అత్యవసర సర్వీసుల కేంద్రంలో శనివారం వైద్య, 104 సిబ్బందితో సమీక్షించారు. అంబులెన్స్‌ల కొరతతో రోగుల తరలింపు ఆలస్యంపై చర్చించారు. దీంతో అదనంగా 14 అంబులెన్స్‌లు కేటాయిస్తు నిర్ణ యం తీసుకున్నారు. ఇటీవల కొత్తవి రావడంతో వాటిని కూడా కేటాయించారు.


దీంతో మొత్తం 20 వాహనాలు ఆదివారం నుంచి కొవిడ్‌ రోగుల తరలింపునకు ప్రత్యే కంగా అందుబాటులోకి రానున్నాయి. కాకినాడ, రాజమ హేంద్రవరం, అమలాపురం డివిజన్లకు అయిదేసి చొప్పు న, బొమ్మూరు క్వారంటైన్‌ వద్ద 3, పాజిటివ్‌ వచ్చిన వారిలో వృద్ధులు, పసిపిల్లలు ఉంటే తక్షణం విశాఖలో విమ్స్‌కు తరలించడానికి రెండు అంబులెన్స్‌లు కేటాయిం చారు. ఇందులో సగం కొత్తవి, సగం పాతవి ఇకపై సేవ లు అందించనున్నాయి. మరోపక్క జిల్లాలో 12వేలకు పైగా కొవిడ్‌ శాంపిళ్లు పేరుకుపోయాయి. ఈ అంశమూ ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం ప్రస్తావనకు వచ్చింది. ఇకపై జిల్లాలో కొత్త శాంపిళ్ల సేకరణ తగ్గించి పేరుకు పోయిన శాంపిళ్లకు సంబంధించి ఫలితాలు ఇచ్చేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రైమరీ కాంటాక్ట్‌ల నుంచే శాంపిళ్లు సేకరించాలని సూచించారు. 

Updated Date - 2020-07-05T10:46:19+05:30 IST