ఒక్కరోజే 1,399 కేసులు

ABN , First Publish Date - 2020-08-20T11:46:30+05:30 IST

కొవిడ్‌ 19 వైరస్‌ ఉధృతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా అన్నవరం దేవస్థానంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వ్యక్తికి కరోనా సో

ఒక్కరోజే 1,399 కేసులు

 జిల్లావ్యాప్తంగా ఇప్పటిదాకా 43,999 పాజిటివ్‌లు        

 అన్నవరం దేవస్థానం ఉద్యోగి కొవిడ్‌తో మృతి 

 జీఎస్‌ఎల్‌ భవనం నుంచి దూకి ఒక బాధితుడు ఆత్మహత్య


కాకినాడ/అన్నవరం/రాజానగరం, ఆంధ్రజ్యోతి : కొవిడ్‌ 19 వైరస్‌ ఉధృతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా అన్నవరం దేవస్థానంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వ్యక్తికి కరోనా సోకి మృతి చెందారు. రాజానగరం జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఒక వ్యక్తి జిల్లా కోర్టులో అటెండర్‌. బుధవారం రాత్రి ఆయన ఆస్పత్రి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.


ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే తాజాగా చేసిన కొవిడ్‌ పరీక్షల ఫలితాల్లో 1,399  మంది కొవిడ్‌ బారినపడ్డారు. దీంతో జిల్లావ్యాప్తంగా 43,999 కేసులు ఇప్పటివరకు నమోద య్యాయి. తాజా గణాంకాల మేరకు 28,637 మంది వ్యాధి బారి నుంచి బయటపడి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక కేసుల వివరాలు చూస్తే కాకినాడలో 218, రూరల్‌లో 70, రాజమహేంద్రవరంలో 154, రూరల్‌లో 89, అమలాపురంలో 76, ఆలమూరులో 60, రావులపాలెంలో 58  కొత్త కేసులు నమోద య్యాయి. మిగిలినచోట్ల ఒకటి నుంచి 39లోపు కేసులు వచ్చాయి.


కొవిడ్‌తో మరో ముగ్గురి మృతి

జీజీహెచ్‌ (కాకినాడ)/ అమలాపురం రూరల్‌, ఆగస్టు 19:  కొవిడ్‌ బారిన పడిన ఇద్దరు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. కాకినాడకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కొవిడ్‌ బారినపడి ఈనెల 7వ తేదీన కొవిడ్‌ ఆసుపత్రిలో చేరాడు. అలాగే కాకినాడ రూరల్‌ మండలం తూరంగికి చెందిన 59 ఏళ్ల వ్యక్తి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో చికిత్స కోసం ఈనెల 12న చేరాడు.


వీరిరువురు జీజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందారు. ఇక కిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమలాపురానికి 47 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్టు బుధవారం వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-08-20T11:46:30+05:30 IST