13మంది లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై కేసులు

ABN , First Publish Date - 2020-04-24T09:39:30+05:30 IST

రాజమహేంద్రవరంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 13మందిపై పోలీసులు కేసులు నమోదు

13మంది లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై కేసులు

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 23: రాజమహేంద్రవరంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 13మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గురువారం నగరంలో పలు ప్రాంతాల్లో ఇష్టానుసారం బైక్‌లపై తిరుగుతున్న 18 మందిని అరెస్టు చేశారు. ఓ బైక్‌ను సీజ్‌ చేశారు. అలాగే మోటార్‌ వాహన చట్టం ప్రకారం 629 మందిపై కేసులు నమోదు చేసి వారి నుంచి రూ.3,48,000 అపరాధ రుసుములు విధించారు. 

Updated Date - 2020-04-24T09:39:30+05:30 IST