హేవలాక్ బిడ్ర్జికి 120 ఏళ్లు
ABN , First Publish Date - 2020-09-01T08:17:18+05:30 IST
రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య గోదావరిపై తొలి వంతెనకు 120 ఏళ్లు వచ్చాయి. అదే హేవలాక్ బ్రిడ్జి. దీనిని 1897 నవంబరు 11న నిర్మాణ పనులు ప్రారంభించారు. దీని పొడవు 2,700 మీటర్లు ఉంది. 1900 ఆగస్టు 6న తొలి

రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య గోదావరిపై తొలి వంతెనకు 120 ఏళ్లు వచ్చాయి. అదే హేవలాక్ బ్రిడ్జి. దీనిని 1897 నవంబరు 11న నిర్మాణ పనులు ప్రారంభించారు. దీని పొడవు 2,700 మీటర్లు ఉంది. 1900 ఆగస్టు 6న తొలి రైలు హౌరా మెయిల్ ప్రయాణించింది. అయితే అదే నెల 30న మద్రాసు గవర్నర్ హేవలాక్ దీన్ని ప్రారంభించారు.
1997లో ఈ బ్రిడ్జిని మూసేసిన తర్వాత రైల్వే శాఖ మొత్తం ఊడపీక్కునిపోవడానికి ప్రయత్నించింది. స్థానిక ప్రజలు ఈ బ్రిడ్జిని కాపాడుకోవడానికి ఉద్యమించారు. చారిత్రాత్మక హేవలాక్ బ్రిడ్జిని స్మారక కట్టడంగా మార్చాలని ప్రతిపాదించారు.