-
-
Home » Andhra Pradesh » East Godavari » 10 basket of gold Theft
-
రత్నగిరి సత్రం గదుల్లో..10 తులాల బంగారం చోరీ
ABN , First Publish Date - 2020-03-13T09:38:52+05:30 IST
అన్నవరం దేవస్థానంలో సీతారా మ సత్రంలో గురువారం ఓ భక్తురాలికి చెందిన 10తులాల బంగారం చోరీకి గురైంది.

అన్నవరం, మార్చి 12: అన్నవరం దేవస్థానంలో సీతారా మ సత్రంలో గురువారం ఓ భక్తురాలికి చెందిన 10తులాల బంగారం చోరీకి గురైంది. కాకడా పల్లికి చెందిన టి.ప్రసాద్, మున్ని దంపతులు వివాహ వేడుకకు హాజరయ్యారు. సత్రంలో 60 నెంబరు గది అద్దెకు తీసుకున్నారు. ఆభరణాలు బ్యాగ్‌లో పెట్టి మున్ని స్నానం చేయడానికి వెళ్లింది. అప్పటికే ప్రసాద్ నిద్రి స్తుండడంతో దుండగులు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధి తులు ఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆభరణాలతో పాటు బ్యాగ్‌లో రూ.15 వేలు ఉన్నట్టు పేర్కొన్నారు.