35 జడ్పీటీసీ స్థానాలకు 116 మంది పోటీ

ABN , First Publish Date - 2020-03-16T11:16:10+05:30 IST

35 జడ్పీటీసీ స్థానాలకు 116 మంది పోటీ

35 జడ్పీటీసీ స్థానాలకు 116 మంది పోటీ

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 15: జిల్లాలోని 65 జడ్పీటీసీ స్థానాల్లో 30 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 35 స్థానాలకు 116 మంది బరిలో మిగిలారు. ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పీటీసీ అభ్యర్థులకు జడ్పీ సీఈవో కోదండరామిరెడ్డి డిక్లరేషన్‌ ఫారాలను అందించారు. జడ్పీటీసీ స్థానాల వారీగా.. చంద్రగిరిలో 4, చిత్తూరులో 3, గుడిపాలలో 2, పాలసముద్రంలో 4, పెనుమూరులో 4, ఎస్‌ఆర్‌పురంలో 3, కుప్పంలో 4, గుడుపల్లెలో 3, శాంతిపురంలో 5, రామకుప్పంలో 4, మదనపల్లెలో 2, రామసముద్రంలో 5, నిమ్మనపల్లెలో 2, పుత్తూరులో 4, నగరిలో 4, నిండ్రలో 4, వడమాలపేటలో 5, విజయపురంలో 4, గంగవరంలో 3, పెద్దపంజాణిలో 2, వి.కోటలో 3, బైరెడ్డిపల్లెలో 4, పలమనేరులో 3, కలకడలో 2, గుర్రంకొండలో 2, కలికిరిలో 3, ఐరాలలో 3, తవణంపల్లెలో 5, బంగారుపాళ్యంలో 4, నాగలాపురంలో 2, కేవీబీపురంలో 2, పిచ్చాటూరులో 3, సత్యవేడులో 2, నారాయణవనంలో 4, వరదయ్యపాళ్యంలో ముగ్గురు వివిధ పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరికీ ఎన్నికల గుర్తులను శనివారం రాత్రి జడ్పీ యంత్రాంగం కేటాయించింది.

Updated Date - 2020-03-16T11:16:10+05:30 IST