ఈ నెలలోనూ ‘పింఛను’ పెరగలేదు

ABN , First Publish Date - 2020-08-01T10:29:14+05:30 IST

ఈ నెల పింఛను మొత్తం కూడా పెరిగేట్టు లేదు. వైసీపీ అధికారంలోకి వస్తే వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకం కింద రూ.3వేల పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇస్తుండిన ..

ఈ నెలలోనూ ‘పింఛను’ పెరగలేదు

కొత్తగా 17,105 మందికి వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక మంజూరు


చిత్తూరు అర్బన్‌, జూలై 31: ఈ నెల పింఛను మొత్తం కూడా పెరిగేట్టు లేదు. వైసీపీ అధికారంలోకి వస్తే వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకం కింద రూ.3వేల పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇస్తుండిన రూ.2వేలకు ఏటా రూ.250ని పెంచి నాలుగేళ్లలో రూ.3వేలకు చేర్చనున్నట్లు అధికారంలోకి వచ్చాక మాటమార్చారు. ఆ లెక్కన అయినా ఈ ఏడాది జూలైతో రెండో సంవత్సరం పూర్తవడంతో రూ.2,500 వస్తుందని లబ్ధిదారులు భావించారు. కానీ రూ.2,250 మాత్రమే ఇచ్చారు.


ఆగస్టులోనూ ఇంతే మొత్తం పింఛను సొమ్ము ఇవ్వనున్నారు. కాగా.. జిల్లాలో ఆగస్టు నెలకు సంబంధించి 5,19,427 పింఛన్లకుగానూ రూ.124.79 కోట్లు విడుదలయ్యాయి. కాగా.. కొత్తగా 17,105 మందికి పింఛను మంజూరైందని డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ ఎంఎస్‌ మురళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెలలుగా తీసుకోనివారు, మరణించిన వారితో కలిపి 1,117 పింఛన్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. శనివారం ఒక్క రోజులోనే వందశాతం పింఛన్లు పంపిణీ చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. 

Updated Date - 2020-08-01T10:29:14+05:30 IST