-
-
Home » Andhra Pradesh » Chittoor » Youth commit suicide in sue to cancer
-
రాత్రి ఇంట్లో అంతా నిద్రపోయాక.. ఓ గ్రామ వలంటీర్ దారుణమిదీ..!
ABN , First Publish Date - 2020-06-22T17:36:01+05:30 IST
క్యాన్సర్‌తో బాధపడుతూ జీవితం మీద విరక్తి చెందిన ఓ యువకుడు క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం

యువకుడి ఆత్మహత్య
మదనపల్లె క్రైం (చిత్తూరు): క్యాన్సర్‌తో బాధపడుతూ జీవితం మీద విరక్తి చెందిన ఓ యువకుడు క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం బొంతలపల్లెకు చెందిన రెడ్డెప్ప కుమారుడు జె.హరిబాబు(23) నాలుగేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. డిగ్రీ వరకు చదువుకుని ప్రస్తుతం గ్రామవలంటీర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు అప్పులు చేసి పలుచోట్ల చికిత్స చేయించినా వ్యాధి నయం కాలేదు.
తనకోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి జీవితం మీద విరక్తి చెందిన హరిబాబు శనివారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు బాధితుని చికిత్సనిమిత్తం అతన్ని 108 వాహనంలో మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూనే, అర్థరాత్రి కన్నుమూశాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఆస్పత్రిలోని ఔట్‌పోస్టు పోలీసులు ఘటనపై తనకల్లు పోలీసులకు సమాచారం అందించారు.