-
-
Home » Andhra Pradesh » Chittoor » younger misbehaviour to child girl
-
చిన్నారితో యువకుడి అసభ్య ప్రవర్తన
ABN , First Publish Date - 2020-12-28T05:08:14+05:30 IST
నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు తిరుపతి రూరల్ మండలం పద్మావతిపురంలోని శ్రీనివాస కల్యాణ మండపాల వద్ద టెంకాయ చీపుర్లను విక్రయిస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం వీరి కుమార్తె బస్టాప్ పక్కనున్న అంగడిలో చాక్లెట్ కొంటుండగా, చిత్తు కాగితాలు ఏరుకునే యువకుడొకడు అసభ్యకరంగా ప్రవర్తించాడు.

దేహశుద్ధి చేసిన స్థానికులు
యువకుడికి మతిస్థిమితం లేదని
తేలడంతో విడిచిపెట్టిన పోలీసులు
తిరుచానూరు, డిసెంబరు 27: నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు తిరుపతి రూరల్ మండలం పద్మావతిపురంలోని శ్రీనివాస కల్యాణ మండపాల వద్ద టెంకాయ చీపుర్లను విక్రయిస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం వీరి కుమార్తె బస్టాప్ పక్కనున్న అంగడిలో చాక్లెట్ కొంటుండగా, చిత్తు కాగితాలు ఏరుకునే యువకుడొకడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. స్థానికులు గమనించి, అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చివరకు ఆ యువకుడికి మతిస్థిమితం లేకపోవడంతోపాటు దివ్యాంగుడిగా గుర్తించడంతో పోలీసులు విడిచిపెట్టారు.