-
-
Home » Andhra Pradesh » Chittoor » working as a tourisum development target
-
పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా
ABN , First Publish Date - 2020-12-16T04:28:52+05:30 IST
పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని డివిజనల్ మేనేజరు ఎం.గిరిధర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి డీవీఎంగా మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు.

తిరుపతి(తిలక్‌రోడ్డు), డిసెంబరు 15: పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని డివిజనల్ మేనేజరు ఎం.గిరిధర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి డీవీఎంగా మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు డీవీఎంగా ఉన్న సురేష్‌రెడ్డి పదోన్నతిపై విజయవాడలోని ప్రధాన కార్యాలయానికి బదిలీ కావడంతో.. తిరుమల ఆర్టీసీ డీఎంగా ఉన్న గిరిధర్‌రెడ్డిని ఆయన స్థానంలో నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి స్థానిక ఆలయాలు (శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, కపిలతీర్థం, ముక్కోటి ఆలయం).. కాణిపాకం స్థానిక ఆలయాలు (కాణిపాకం, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, కపిలతీర్థం, ముక్కోటి ఆలయం) పర్యాటక ప్యాకేజీలను ప్రారంభించామన్నారు. ప్రతిరోజూ విష్ణునివాసం, శ్రీనివాసం వసతిగృహాల సముదాయం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి సాయంత్రం 5గంటల్లోగా తిరిగి వచ్చేలా ఈ ప్యాకేజీ టూర్లకు ప్రణాళిక రూపొందించామన్నారు. దీనికి టికెట్ ధరను ఒక్కొక్కరికి నాన్ ఏసీ రూ.250-300, ఏసీ అయితే 350-450గా నిర్ణయించామన్నారు. లాక్‌డౌన్ అన్‌లాక్‌తో హార్సిలీహిల్స్, శ్రీకాళహస్తి, తిరుమల, జూపార్కు వద్ద రెస్టారెంట్లను ప్రారంభించామని వివరించారు. త్వరలో శ్రీవారి ధర్శనాలతో కూడిన స్థానిక ఆలయాల దర్శన ప్యాకేజీని ప్రారంభిస్తామన్నారు.