అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ABN , First Publish Date - 2020-12-17T06:29:41+05:30 IST
మండల పరిధిలోని జవ్వునిపల్లెకు చెందిన శ్రీనివాసులు భార్య వేదవతి (32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

వి.కోట, డిసెంబరు 16: మండల పరిధిలోని జవ్వునిపల్లెకు చెందిన శ్రీనివాసులు భార్య వేదవతి (32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానికుల, పోలీసుల కథనం మేరకు.. శ్రీనివాసులుకు కర్ణాటక రాష్ట్రం పిచ్చిగుండ్లపల్లెకు చెందిన వేదవతితో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పవన్‌కుమార్ (12), మిథున్‌కుమార్ (8) అనే పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో వేదవతి బుధవారం తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లింది. ఎంతకీ రాకపోవడంతో కుటుంబసభ్యులు వారి సొంత బావిలో గాలించారు. బావిలోని ఆమెను బయటకుతీశారు. వి.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు యత్నిం చారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. వారు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ బిడ్డ మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ మహేష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తింట్టి వారు అంటుండగా.. భర్త, అత్తమామమలే హతమార్చి బావిలో పడేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.