రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2020-12-28T05:09:56+05:30 IST

వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద రెడ్ల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఏపీ రెడ్డి సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
ఐక్యతను చాటుతున్న నాయకులు

ఏపీ రెడ్డి సంఘ నాయకుల డిమాండ్‌


తిరుపతి(విద్య), డిసెంబరు 27: వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద రెడ్ల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఏపీ రెడ్డి సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. తిరుపతిలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సుకు వివిధ జిల్లాల నుంచి పలువురు రెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన తీర్మానాలను రాష్ట్ర అధ్యక్షుడు జి.నరేశ్‌కుమార్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి టి.గోపాల్‌రెడ్డి, కార్యదర్శి పి.సురేంద్రరెడ్డి వెల్లడించారు. ‘గ్రేటర్‌ రాయలసీమలో కాపులను కలుపుకుని రెడ్ల జనగణన చేపట్టాలి. ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయాలి. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు రాష్ట్రంలో త్వరగా అమలు చేయాలి. రెడ్ల ఆడబిడ్డలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తూ.. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. సబ్సిడీ రుణాలివ్వాలి. ఓసీలకు కేటాయించిన సీట్లు, పోస్టులు మాకే కేటాయించాలి. రెడ్డి ఉద్యోగులపై జరుగుతున్న అకృత్యాల రక్షణకు విధివిధానాలు, రెడ్ల ఆధ్వర్యంలో నిర్వహించే విద్యాసంస్థల్లో ఆవర్గాల పేదలకు ఉచిత, నామమాత్ర ఫీజుతో విద్యనందించాలి’ తదితర తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. గంగాధర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, శివారెడ్డి, చంద్రమౌళీశ్వరరెడ్డి, భరత్‌రెడ్డి, కేశవరెడ్డి, కమలాకర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, జ్యోత్స్నారెడ్డి, రాధికారెడ్డి, హరిణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T05:09:56+05:30 IST