బోగంపల్లె రిజర్వాయర్‌కు జలకళ
ABN , First Publish Date - 2020-07-12T11:11:45+05:30 IST
వాల్మీకిపురంలో శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. 95.4మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షానికి స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ
వాల్మీకిపురం, జూలై 11: వాల్మీకిపురంలో శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. 95.4మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షానికి స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరగతి గదులు నీట మునిగాయి. ఉర్దూ హైస్కూల్ ప్రహరీ కూలిపోయింది. స్థానిక నాయక్ వీధి ప్రాంతంలోని కార్పెంటర్ దుకాణాలు నీట మునిగాయి. యంత్రాలు, మోటర్లు పాడవడంతో రూ. లక్ష మేర నష్టం వాటిల్లింది. బైపాస్ రోడ్డులోని పూల తోటల్లో కూడా నీరు చేరింది. కాగా వర్షానికి చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోవడంతో పాటు పట్టణ సమీపంలోని బోగంపల్లె రిజర్వాయర్‌కు నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య కూడా తీరింది.