నేడు శ్రీసిటీలో వాకతాన్‌

ABN , First Publish Date - 2020-03-04T09:17:46+05:30 IST

జాతీయ భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీసిటీ, ఇతర పరిశ్రమలు సంయుక్తంగా బుధవారం శ్రీసిటీ ఇండస్ట్రియల్‌ సేప్టీ వాకతాన్‌ 2020 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీసిటీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

నేడు శ్రీసిటీలో వాకతాన్‌

శ్రీసిటీ(వరదయ్యపాళెం), మార్చి 3: జాతీయ భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీసిటీ, ఇతర పరిశ్రమలు సంయుక్తంగా బుధవారం శ్రీసిటీ ఇండస్ట్రియల్‌ సేప్టీ వాకతాన్‌ 2020 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీసిటీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేలాదిమంది పాల్గొననున్న ఈ వాకతాన్‌ (సుదూర నడక) బుధవారం ఉదయం 7 గంటలకు శ్రీసిటీ జీరో పాయింట్‌ వద్ద ప్రారంభమై 4 కిలోమీటర్ల దూరం కొనసాగి కొబెల్కో కూడలి వద్ద ముగుస్తుందని శ్రీసిటీ అధికారులు తెలిపారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ చీఫ్‌ శివకుమార్‌ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని శ్రీసిటీలో భద్రతా ప్రాముఖ్యతను చాటి చెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్యఉద్దేశమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో 5 వేల మందికిపైగా పరిశ్రమల సీఈవోలు, సిబ్బంది పాల్గొంటారని శ్రీసిటీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సీనియర్‌ ప్రతినిధి వివేక్‌నాయర్‌ వ్యవహరించనున్నారు. 

Updated Date - 2020-03-04T09:17:46+05:30 IST