విశాఖలో భూదందాలకు పాల్పడినట్లు నిరూపిస్తే...: ఎంపీ సత్యనారాయణ

ABN , First Publish Date - 2020-10-21T14:28:38+05:30 IST

విశాఖలో ఎవరైనా భూదందాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలతో నిరూపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

విశాఖలో భూదందాలకు పాల్పడినట్లు నిరూపిస్తే...: ఎంపీ సత్యనారాయణ

తిరుమల: విశాఖలో ఎవరైనా  భూదందాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలతో నిరూపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్‌ను ప్రభుత్వం ఆధారాలతో సహా బయటపెట్టిందన్నారు. రాష్ట్రంలోకే విశాఖ ముఖ్యనగరమని...దేశంలోని ఇతర రాజధానులతో అభివృద్ధిలో పోటీ పడగల నగరం విశాఖ అని తెలిపారు. ప్రజలతో పాటు తాము కూడా రాజధాని విశాఖకు ఎప్పుడు తరలుతుందోనని  ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందే విధంగా సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారన్నారు. దురదృష్టవశాత్తు కోర్టులో కేసులు ద్వారా రాజధాని తరలింపు ప్రక్రియ ఆలస్యం అవుతోందని ఎంపీ సత్యనారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-21T14:28:38+05:30 IST