ప్రైవేట్‌ కొవిడ్‌ సెంటర్లలో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2020-10-14T17:11:51+05:30 IST

తిరుపతిలోని పలు కొవిడ్‌ చికిత్సాకేంద్రాలపై విజిలెన్స్‌ అధికారులు మంగళవారం..

ప్రైవేట్‌ కొవిడ్‌ సెంటర్లలో విజిలెన్స్‌ తనిఖీలు

తిరుపతి: తిరుపతిలోని పలు కొవిడ్‌ చికిత్సాకేంద్రాలపై విజిలెన్స్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ప్రైవేటు కొవిడ్‌ ఆస్పత్రులకు సంబంధించిన కొవిడ్‌ సెంటర్లలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విజిలెన్స్‌ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. తిరుపతి విజిలెన్స్‌ డీఎస్పీ మల్లేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కెన్సెస్‌, లోటస్‌ గ్రాండ్‌ హోటళ్లలోని కొవిడ్‌ చికిత్సా కేంద్రాల్లో రికార్డులను పరిశీలించారు.


చికిత్స పొందుతున్న రోగులనుంచి వసూలుచేసిన ఫీజుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ డీఎస్పీ మల్లేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రైవేటు కొవిడ్‌ సెంటర్లలో రోగులనుంచి అధికంగా ఫీజులు వసూలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. నగరంలోని అన్ని ప్రైవేటు కొవిడ్‌ చికిత్సా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించనున్నట్టు వివరించారు. డీసీటీఓ శ్రీనివాసులు తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-14T17:11:51+05:30 IST