గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2020-09-24T10:57:43+05:30 IST

జిల్లా కేంద్రంలోని గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై రెండ్రోజులుగా విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్‌ ఎస్పీ రమేష్‌ ఆదేశాల మేరకు.. చిత్తూరు పరిసర ప్రాంతాలు, రూరల్‌లోని గ్రానైట్‌

గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై విజిలెన్స్‌ దాడులు

 


చిత్తూరు సెంట్రల్‌, సెప్టెంబరు 23: జిల్లా కేంద్రంలోని గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై రెండ్రోజులుగా విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్‌ ఎస్పీ రమేష్‌ ఆదేశాల మేరకు.. చిత్తూరు పరిసర ప్రాంతాలు, రూరల్‌లోని గ్రానైట్‌ ఫ్యాక్టరీలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. లీజుకు తీసుకున్న గనుల్లో ఎంతవరకు తవ్వకాలు జరిగాయి?


ఆక్రమణలు ఉన్నాయా? పర్మిట్ల పరిస్థితేంటి? వ్యాపారమెంత చేశారు? తదితర అంశాలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించి, ఆక్రమణలుంటే జరిమానా విధించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు. 

Updated Date - 2020-09-24T10:57:43+05:30 IST