శ్రీవారి సేవలో విద్యాధీష తీర్థ

ABN , First Publish Date - 2020-12-12T07:22:58+05:30 IST

పలిమారు మఠం పీఠాధిపతి విద్యాధీష తీర్థ స్వామి శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో విద్యాధీష తీర్థ
విద్యాధీష తీర్థకు ఇస్తికఫాల్‌ స్వాగతం పలుకుతున్న అర్చకులు, ధర్మారెడ్డి

తిరుమల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పలిమారు మఠం పీఠాధిపతి విద్యాధీష తీర్థ స్వామి శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అర్చకులు, అదనపు ఈవో ధర్మారెడ్డి ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లిన పీఠాధిపతి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయాధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. 

Updated Date - 2020-12-12T07:22:58+05:30 IST