-
-
Home » Andhra Pradesh » Chittoor » Veterinary lags behind in ICAR rankings
-
ఐసీఏఆర్ ర్యాంకింగ్‌లో ‘వెటర్నరీ’ వెనుకంజ
ABN , First Publish Date - 2020-12-06T07:59:17+05:30 IST
ఐసీ ఏఆర్ ఆలిండియా అగ్రికల్చరల్ యూనివ ర్సిటీల ర్యాంకింగ్‌లో శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి 64వ ర్యాంకు వచ్చింది.

గత ఏడాది 50.. ప్రస్తుతం 64
తిరుపతి(విద్య), డిసెంబరు 5: భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీ ఏఆర్) 2019కిగాను శనివారం వెల్లడిం చిన ఆలిండియా అగ్రికల్చరల్ యూనివ ర్సిటీల ర్యాంకింగ్‌లో తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి 64వ ర్యాంకు వచ్చింది. గత ఏడాది ర్యాంకింగ్‌లో 50వ స్థానంలో నిలవగా ప్రస్తుతం 14 స్థానాలు కిందకు దిగజారింది. దేశవ్యాప్తంగా ఐసీఏఆర్ అక్రిడిటేషన్ కల్గిన 67 అగ్రివర్సిటీ (అగ్రికల్చరల్, వెటర్నరీ, హార్టికల్చరల్, ఫిషరీష్)ల్లో జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు, రీసెర్చ్ పబ్లికేషన్స్, రైతులస్థాయికి తీసుకెళ్లే ఎక్స్‌టెన్షన్ ప్రోగ్రామ్స్, స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ రేషియో, రెగ్యులర్ ఆఫీసర్లు, రిక్రూట్‌మెంట్ వంటివి ప్రామాణికంగా తీసుకుని ర్యాంకులు ప్రకటించారు. ఈ ర్యాంకులో వెనుకబడితే జాతీయస్థాయి ఐసీఏఆర్ కోటా అడ్మిషన్లు, ఫండింగ్ ప్రాజెక్టులు వంటివి చాలా తక్కువగా వస్తాయని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. కాగా.. గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ గత ఏడాది 31వస్థానం సాధించగా.. ఈఏడాది 13వ ర్యాంకును, వెంకటరామన్నగూడెంలోని హార్టికల్చరల్ వర్సిటీ.. గత ఏడాది 47 కాగా.. ఈఏడాది 34వ ర్యాంకు సాధించింది.
వచ్చే ఏడాది మెరుగైన ర్యాంకు సాధిస్తాం
వర్సిటీలో విస్తరణ విభాగాన్ని మరింత పటిష్ఠం చేసి వచ్చే ఏడాది మెరుగైన ర్యాంకు సాధిస్తాం. ఈ విషయమై అధికారులతో సమీక్షించి కార్యాచరణ రూపొందిస్తున్నాం. గత ఏడాది రిపోర్టును సరిగా ప్రజంట్ చేయలేకపోవడం, రెగ్యులర్ వీసీ లేవపోవడం వంటి కారణాలతో వెనుకబడినట్లు తెలుస్తోంది. ఆఫీసర్లు, అధ్యాపకులు, ఉద్యోగుల సమన్వయంతో వచ్చేసారి అధిగమిస్తాం.
