నేటి నుంచి స్విమ్స్‌లో తాత్కాలికంగా ఓపీ సేవలు రద్దు

ABN , First Publish Date - 2020-07-14T11:11:27+05:30 IST

తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో మంగళవారం నుంచి 18వ తేది వరకు ఓపీ సేవలను రద్దు..

నేటి నుంచి స్విమ్స్‌లో తాత్కాలికంగా ఓపీ సేవలు రద్దు

తిరుపతి (వైద్యం), జూలై 13: తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో మంగళవారం నుంచి 18వ తేది వరకు ఓపీ సేవలను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్‌ డాక్టర్‌ వెంగమ్మ సోమవారం తెలిపారు. వివిధ విభాగాల్లో వైద్యసేవలు అందిస్తున్న సీనియర్‌ వైద్యులు, రెసిడెంట్‌ డాక్టర్లు, నర్సింగ్‌, పారామెడికల్‌, పారిశుధ్య సిబ్బందిలో దాదాపు 40 మందికిపైగా కరోనా సోకిందన్నారు.  ఈ వైరస్‌ తీవ్రతను తగ్గించడం కోసం ఐదు రోజుల పాటు అన్ని రకాల ఓపీ సేవలను రద్దు చేశామన్నారు. కాగా, ఐదు రోజుల తర్వాత పరిస్థితిని బట్టి ఓపీ సేవలను ప్రారంభించాలా లేదా అనేది పత్రికల ద్వారా తెలియజేస్తామన్నారు. క్యాజువాలిటీలో మాత్రం అత్యవసర, ఓటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టంచేశారు. 

Updated Date - 2020-07-14T11:11:27+05:30 IST