యూపీఎస్సీ పరీక్షలు ప్రశాంతం
ABN , First Publish Date - 2020-12-21T05:20:05+05:30 IST
తిరుపతిలో యూపీఎస్సీ ఆదివారం నిర్వహించిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (అసిస్టెంట్ కమాండెంట్) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

తిరుపతి రూరల్, డిసెంబరు 20: తిరుపతిలో యూపీఎస్సీ ఆదివారం నిర్వహించిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (అసిస్టెంట్ కమాండెంట్) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు రెండో పేపర్ పరీక్షలు జరిగాయి. ఐదు కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1,452 మందికి అభ్యర్థులకుగాను 400 మంది (27.51శాతం) హాజరయ్యారు. పరీక్షలను యూపీఎస్సీ పర్యవేక్షణాధికారి ఏకే మిశ్రా, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి పర్యవేక్షించారు.