-
-
Home » Andhra Pradesh » Chittoor » two dead by electric shock
-
విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2020-11-27T06:08:53+05:30 IST
ఎర్రావారిపాలెం మండలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు.

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
భాకరాపేట, నవంబరు 26: ఎర్రావారిపాలెం మండలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. పీలేరు రూరల్ సీఐ మురళీకృష్ణ తెలిపిన ప్రకారం.. బోడేంవాడ్లపల్లి గ్రామం చిన్నతిప్పిగుంట సమీప పొలాల వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెంది ఉన్నారని డయల్ 100కు సమాచారం వచ్చింది. దీంతో ఎర్రావారిపాలెం ఎస్‌ఐ సోమశేఖర్ తన సిబ్బందితో వెళ్ళి గాలించగా రెండు మృతదేహాలు చెట్లల్లో పడి ఉన్నాయి. మృతదేహాలపై విద్యుత్ తీగలు తగిలిన ఆనవాళ్లు ఉన్నాయని సీఐ తెలిపారు. వీరి వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండొచ్చన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం వచ్చిన కూలీలుగా అనుమానిస్తున్నామన్నారు. వీఆర్వో మస్తాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.