వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు మరోసారి వాయిదా
ABN , First Publish Date - 2020-12-01T17:37:52+05:30 IST
వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ మరోసారి వాయిదా వేసింది.

తిరుమల: వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ మరోసారి వాయిదా వేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు సంబంధించిన టికెట్లను జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. అయితే సాంకేతిక కారణాల రీత్యా టికెట్ల విడుదలను వాయిదా వేసింది. కాగా టీటీడీ వాయిదాలపై భక్తులు మండిపడుతున్నారు.