‘శ్రీవాణి భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు’

ABN , First Publish Date - 2020-12-16T04:35:28+05:30 IST

తిరుమల శ్రీవారి దర్శనానికి రూ.10 వేలు విరాళం అందజేసి వస్తున్న శ్రీవాణి ట్రస్టు దాతలకు ఆలయంలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విజయవాడకు చెందిన లక్ష్మీపెరుమాళ్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

‘శ్రీవాణి భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు’

తిరుమల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనానికి రూ.10 వేలు విరాళం అందజేసి వస్తున్న శ్రీవాణి ట్రస్టు దాతలకు ఆలయంలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విజయవాడకు చెందిన లక్ష్మీపెరుమాళ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీవారిని మంగళవారం ఉదయం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ప్రొటోకాల్‌ దర్శనమని చెప్పి సాధారణ భక్తుల తరహాలో దర్శనం చేయిస్తున్నారన్నారు. ఎలాంటి ప్రాధాన్యం లేకుంటే ముందే చెప్పాలి కానీ, ఇలా చేయడం సరికాదన్నారు. 


Read more