228 రోజుల తర్వాత..!

ABN , First Publish Date - 2020-11-06T08:57:48+05:30 IST

చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు కాలిబాట ద్వారా 228 రోజుల తర్వాత భక్తులను అనుమతించారు.

228 రోజుల తర్వాత..!

 శ్రీవారిమెట్టు మార్గాన తిరుమలకు భక్తులు 


చంద్రగిరి, నవంబరు 5: చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు కాలిబాట ద్వారా 228 రోజుల తర్వాత భక్తులను అనుమతించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 20న మూతపడిన ఈ మార్గాన్ని గురువారం ప్రారంభించారు. దీంతో భక్తులు శ్రీవారిమెట్టు వద్ద కల్యాణ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టారు. గొవింద నామస్మరణలతో ముందుకు కదిలారు. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లున్న భక్తులనే ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతించారు. శ్రీవారిమెట్టు మార్గంలో శ్రీవారి దర్శనానికి టికెట్లు ఇవ్వాలని భక్తులు డిమాండు చేశారు. ఈ కాలిబాటలో భక్తులకు తాగునీటి సౌకర్యంతో పాటు టీటీడీ, పారెస్ట్‌ అధికారుల ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. 

Updated Date - 2020-11-06T08:57:48+05:30 IST