కరోనాతో ప్రధానోపాధ్యాయుడి మృతి

ABN , First Publish Date - 2020-11-06T08:55:55+05:30 IST

బుచ్చినాయుడుకండ్రిగ మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ ప్రాఽథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్‌.దినేష్‌(45) కరోనాతో గురువారం మృతి చెందారు.

కరోనాతో ప్రధానోపాధ్యాయుడి మృతి

బుచ్చినాయుడుకండ్రిగ/శ్రీకాళహస్తి, నవంబరు 5: బుచ్చినాయుడుకండ్రిగ మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ ప్రాఽథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్‌.దినేష్‌(45) కరోనాతో గురువారం మృతి చెందారు.శ్రీకాళహస్తిలోని దక్షిణ కైలాసనగర్‌లో నివాసం ఉంటోన్న ఈయనకు గత నెల మొదటి వారంలో అనారోగ్యం తలెత్తడంతో కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా నెగటివ్‌ వచ్చింది.  సీజనల్‌ వ్యాధిగా భావించి చికిత్సలు చేయించుకోగా వారం తర్వాత దగ్గు ఎక్కువ కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో సీటీ స్కాన్‌ చేయించుకున్నాడు. కరోనా వైరస్‌ సోకినట్లు బయటపడింది. అప్పటికే ఊపిరితిత్తులు సగ భాగం దెబ్బతిన్నట్లు  వైద్యులు గుర్తించారు.  చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దినేష్‌ గురువారం మృతి చెందారు.


యూటీఎఫ్‌ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించిన దినేష్‌ మృతిపట్ల ఎంఈవో రవీంద్రనాథ్‌, యూటీఎఫ్‌ నాయకులు ఈశ్వరయ్య, ఎస్టీయూ నాయకులు యువశ్రీమురళి,శ్రీకాళహస్తి ఏపీ ఎన్‌జీవో శాఖ అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్‌, ఉపాధ్యాయ సంఘం నాయకులు శ్రీనివాసరావు, రామకృష్ణ తదితరులు  సంతాపం తెలిపారు.

Updated Date - 2020-11-06T08:55:55+05:30 IST