సీపీఐ నారాయణకు సోదరవియోగం

ABN , First Publish Date - 2020-11-03T09:20:03+05:30 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సోదరుడు,టీడీపీ నాయకుడు అయిన మనోహర్‌ నాయుడు(76) సోమవారం ఉదయం నగరి లోని స్వగృహంలో మరణించారు.

సీపీఐ నారాయణకు సోదరవియోగం

పుత్తూరు, నవంబరు 2: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సోదరుడు,టీడీపీ నాయకుడు అయిన మనోహర్‌ నాయుడు(76) సోమవారం ఉదయం   నగరి లోని స్వగృహంలో మరణించారు.టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా పలువురు నేతలతో మంచి సంబంధాలున్న మనోహర్‌ నాయుడు గతంలో టీడీపీ తరపున పనిచేసినప్పటికీ కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా వుంటూవచ్చారు. గుండెపోటుతో సోదరుడు మరణించిన విషయం తెలిసి  జిల్లా పర్యటనలో వున్న నారాయణ నగరికి చేరుకొన్నారు. సోదరుడి భౌతికకాయానికి నివాళులర్పించారు.సీపీఐ నాయకులు రామానాయుడు, నరసింహులు, జనార్దన్‌ తదితరులు కూడా నివాళులర్పించారు.సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జి.శ్రీనివాసులు, మాజీమంత్రి అమరనాధరెడ్డి తదితరులు మనోహర్‌ నాయుడి కుటుంబ సభ్యులకు సానుభూతి సందేశాలు పంపారు.మంగళవారం సాయంత్రం  ఆయన స్వగ్రామమైన అయనంబాకంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.

Updated Date - 2020-11-03T09:20:03+05:30 IST