ఆరేళ్ల బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2020-11-03T09:17:56+05:30 IST

ఆరేళ్ల దళిత బాలికపై అత్యాచారం ఘటన పెద్దపంజాణి మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.

ఆరేళ్ల బాలికపై అత్యాచారం

బాధితురాలి పరిస్థితి ఆందోళనకరం

నిందితుడిపై పోక్సో కేసు నమోదు


పెద్దపంజాణి/గంగవరం, నవంబరు 2 : ఆరేళ్ల దళిత బాలికపై అత్యాచారం ఘటన పెద్దపంజాణి మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు..రాయలపేటకు చెందిన మహేష్‌(28)  ఆదివారం సాయంత్రం ఇంటి బయటున్న ఓ బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.  గుర్తించిన స్థానికులు నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.అప్పటికే బాలిక పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పెద్దపంజాణి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా దిశ డీఎస్పీ బాబూ రాజేంద్రప్రసాద్‌ సోమవారం బాధిత బాలికను పరామర్శించారు.నిందితుడిపై పోక్సో కేసుతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేస్తున్నట్లు వివరించారు.


సత్వర దర్యాప్తుతో నిందితుడికి వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తామన్నారు.అభం శుభం తెలియని ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం డిమాండ్‌ చేశారు.దళిత నాయకులతో కలసి సోమవారం గంగవరం సీఐ రామకృష్ణాచారిని  కలిసిన ఆయన  మాట్లాడుతూ రాష్ట్రంలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో దళితులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం  చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. సంఘటన జరిగి రెండు రోజులవుతున్నా ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం శోచనీయమన్నారు, ఇలాంటి సంఘటనలు జిల్లాలో మరెక్కడా జరగకుండా ప్రభుత్వం దళితులకు రక్షణ కల్పించాలన్నారు.ఆయన వెంట మాలమహానాడు నేతలు జయశంకర్‌, మంజుల, నందిని తదితరులున్నారు.

Updated Date - 2020-11-03T09:17:56+05:30 IST