ఘనంగా అశోక విజయదశమి వేడుకలు

ABN , First Publish Date - 2020-10-28T11:10:41+05:30 IST

యుద్ధం వద్దంటూ బౌద్ధ ధర్మం ఆచరించిన అశోకుడి బాటలో అందరూ నడవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

ఘనంగా అశోక విజయదశమి వేడుకలు

 మదనపల్లె రూరల్‌, అక్టోబరు 27: యుద్ధం వద్దంటూ బౌద్ధ ధర్మం ఆచరించిన అశోకుడి బాటలో అందరూ నడవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని అంకిశెట్టిపల్లె వద్ద ఉన్న బుద్ధుడికొండపై ఘనంగా అశోక విజయదశమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్‌ మాట్లాడుతూ కళింగ యుద్ధంలో లక్షల మంది చనిపోవడంపై చలించిన అశోక చక్రవర్తి బౌద్ధధర్మాన్ని పాటించారని గుర్తుచేశారు. ఆయన బాటలో అంబేడ్కర్‌ నడచి దేశంలో బౌద్ధం వ్యాప్తికి బీజం వేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సబ్‌జైలు సూపరింటెండెంట్‌ బురుజు లక్ష్మీనారాయణ, బౌద్ధదమ్మాచారి సోమరాజు, ప్రజాకవి పోతబోలు రెడ్డెప్ప, బాస్‌ నేతలు శ్రీచందు, చాట్ల బయన్న, నీరుగట్టి రమణ, కోటూరి రత్నం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T11:10:41+05:30 IST