అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోండి

ABN , First Publish Date - 2020-10-27T06:56:28+05:30 IST

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నేతలు కోరారు.

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోండి

చిత్తూరు, అక్టోబరు 26: అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నేతలు కోరారు. ‘స్పందన’ కార్యక్రమం రద్దని ప్రకటించినా సోమవారం కలెక్టరేట్‌కు కొందరు బాధితులు తరలివచ్చి, అక్కడ ఏర్పాటు చేసిన పెట్టెలో వినతిపత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ బాధితులైన శివరామకృష్ణ, బెల్లంకొండ శ్రీనివాస్‌, జయంతి మాట్లాడారు. రూ.10వేలలోపు డబ్బు కట్టిన వారు డీఎల్‌ఎస్‌ఏలో  నమోదు చేసుకున్నా.. 30వేల మందికి ఇంతవరకు బ్యాంకులో డబ్బులు జమ కాలేదని చెప్పారు. అగ్రిగోల్డ్‌ కేసును ఏపీ హైకోర్టుకు బదలాయించాలని, లేకుంటే తెలంగాణ కోర్టు వెంటనే విచారణ చేసేలా చూడాలని కోరారు.


Updated Date - 2020-10-27T06:56:28+05:30 IST