రాజరాజేశ్వరీదేవిగా బోయకొండ గంగమ్మ

ABN , First Publish Date - 2020-10-27T06:49:39+05:30 IST

దసరా మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బోయకొండ గంగమ్మ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

రాజరాజేశ్వరీదేవిగా బోయకొండ గంగమ్మ

 చౌడేపల్లె, అక్టోబరు 26: దసరా మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బోయకొండ గంగమ్మ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి అమ్మవారిని చత్భుజాలతో శంకు, చక్రంలు, కమలం, చెరుకుగడలతో,  స్వర్ణాభరణాలు, ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం వేదపండితులు అద్దాల మండపం వద్ద అమ్మవారి ఉత ్సమూర్తిని ఏర్పాటు చేసి, కలశ స్థాపన చేసి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం చండీ హోమం, గణపతి, అదిత్య నవగ్రహ, మృత్యుంజయేశ్వర, నవ దుర్గా హోమాలు చేశారు.


భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిన దర్శించుకునేలా ఆలయ ఈవో చంద్రమౌళి చర్యలు తీసుకున్నారు. ఉభయదారులుగా వాయల్పాడుకు చెందిన శ్రీదేవి, రఘురామిరెడ్డి, వంశీప్రియ, సౌమిత్‌రెడ్డి పాల్గొని అన్నదానానికి రూ..లక్ష విరాళంగా ఈవోకు అందజేశారు. 

Updated Date - 2020-10-27T06:49:39+05:30 IST