అన్న మృతి వార్త వినగానే....

ABN , First Publish Date - 2020-10-27T06:45:02+05:30 IST

అన్న మృతి వార్త వినగానే తమ్ముడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

అన్న మృతి వార్త వినగానే....

 గుండెపోటుతో కుప్పకూలిన తమ్ముడు 


పుంగనూరు, అక్టోబరు 26: అన్న మృతి వార్త వినగానే తమ్ముడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరూ ఆదివారం మృతి చెందడంతో వారి స్వస్థలమైన పుంగనూరు మండలం సింగిరిగుంట పంచాయతీ మార్లపల్లెలో విషాదచాయలు అలుముకున్నాయి. డిప్యూటీ తహసీల్దార్‌గా పదవీ విరమణ చేసిన శ్యామల్‌(70) పుంగనూరు గోకుల్‌వీధిలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామల్‌ ఆదివారం పుంగనూరులో మరణించారు. ఈ విషయాన్ని కుటుంబీకులు సోదరుడైన సుందర్‌రాజుకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. అన్న మృతి వార్త వినగానే మదనపల్లె ఇంటిలో సుందర్‌రాజు గుండెపోటు గురై మృతిచెందాడు. అన్నదమ్ములైన శ్యామల్‌, సుందర్‌రాజుల మృతదేహాలను మార్లపల్లెకు తరలించి సోమవారం అంతక్రియలు నిర్వహించారు.  

Updated Date - 2020-10-27T06:45:02+05:30 IST