నాసిరకం విత్తనాలతో దెబ్బతిన్న తీర్థం రైతన్నలు

ABN , First Publish Date - 2020-10-27T06:39:03+05:30 IST

బైరెడ్డిపల్లె మండలం తీర్థం ప్రాంతంలో నాసిరకం విత్తనాలతో వరిపంట పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీర్థం పంచాయతీ పరిధిలో దాదాపు 150 ఎకరాల్లో రైతులు వరిపంట సాగుచేశారు.

నాసిరకం విత్తనాలతో దెబ్బతిన్న తీర్థం రైతన్నలు

బైరెడ్డిపల్లె, అక్టోబరు 26 : బైరెడ్డిపల్లె మండలం తీర్థం ప్రాంతంలో నాసిరకం విత్తనాలతో వరిపంట పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీర్థం పంచాయతీ పరిధిలో దాదాపు 150 ఎకరాల్లో రైతులు వరిపంట సాగుచేశారు. నాసిరకం విత్తనాలు వారి పాలిట శాపంగా మారింది. కోతకొచ్చేదశలోని వరి పంటను చూసి రైతులు నిరాశతో కుంగిపోతున్నారు. పంట చూడడానికి బాగానేవున్నా వరి కంకుల్లో బియ్యం గింజలు ఏర్పడలేదు. ఈప్రాంతంలో దాదాపు రూ.30లక్షల వరకు పంటనష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. కరోనా కష్టకాలంలో అప్పులు చేసి పంట సాగుచేస్తే కనీసం పెట్టుబడి కూడా వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరాకు రూ.20వేలు ఖర్చయిందని ప్రస్తుతం ఆ పెట్టుబడి వచ్చినా సంతోషమేనని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 30 నుంచి 40 బస్తాల దిగుబడి వచ్చేదని ప్రస్తుతం 5 బస్తాలు కూడా వచ్చేలా లేవని వాపోతున్నారు. విత్తనాలను బయటప్రాంతాల నుంచి తెచ్చి ఇలా మోసపోయామని పేర్కొంటున్నారు. అధికారులు స్పం దించి పంట నష్టపరి హారం అందజేసి ఆదు కోవాలని తీర్థం రైతులు కోరు తున్నారు. 

Updated Date - 2020-10-27T06:39:03+05:30 IST