బీజేపీ బలోపేతానికి కమిటీలు కష్టపడి పనిచేయాలి

ABN , First Publish Date - 2020-10-13T09:52:34+05:30 IST

బీజేపీ బలోపేతానికి కమిటీలు కష్టపడి పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు

బీజేపీ బలోపేతానికి కమిటీలు కష్టపడి పనిచేయాలి

పార్టీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి 

చిత్తూరు సెంట్రల్‌, అక్టోబరు 12: బీజేపీ బలోపేతానికి కమిటీలు కష్టపడి పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నగర ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బీజేపీ జిల్లా కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్నివర్గాలను సమన్వయం చేసుకుని పార్టీ కమిటీలు పనిచేయాల్సి ఉందని సూచించారు.గ్రామస్థాయి నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని పటిష్ఠం చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్‌, నాయకులు రామచంద్రుడు, గుత్తా ప్రభాకర నాయుడు, జగదీశ్వర నాయుడు, అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-13T09:52:34+05:30 IST